MLC కవిత మెడికల్ రిపోర్ట్స్‌ను లాయర్లకు అందించాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కవిత ఆరోగ్యం దృష్ట్యా జైలు అధికారులను ఆదేశించారు. అంతేకాదు.. కవితకు జైల్లో ఇంటి నుంచి భోజనం, పరుపులు, బెడ్షీట్లు, పుస్తకాలు, మందులు, కొన్ని న్యూ్స్ పేపర్లు, పెన్నులు ఏర్పాటు చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో కోర్టు పేర్కొంది. కాగా, పది రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం మరోసారి ఈడీ అధికారులు కవితను కోర్టులో హాజరుపరిచారు.
14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోరగా.. కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం కవితను తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో కవిత ఆరోగ్యం దృష్ట్యా ఇంటి భోజనంతో పాటు పలు అవసరాలకు అనుమతి ఇచ్చింది. అయితే ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కవిత విజ్ఞప్తి మేరకు ఈ వెసులుబాట్లు ఇచ్చింది.
ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కవితకు ఇంటి భోజనం తెచ్చుకోవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే జైల్లో పడుకోవడానికి మంచం, పరుపు, చెప్పులు, బట్టలు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. కవితకు న్యాయస్థానం ఈరోజు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.