బర్రెలక్క.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఎన్నికల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె ట్రెండింగ్‌లో నిలిచారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి హాట్ టాపిక్‌గా మారారు. అయితే యూట్యూబ్, ఇన్ స్టాలో తన పెళ్లికి సంబంధించిన ప్రతి వీడియోను షేర్ చేస్తోంది. పెళ్లి చూపులు వీడియో, నిశ్చితార్థం వీడియో, కట్న కానులు మాట్లాడుకున్న వీడియో, ఫ్రెండ్స్‌కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది.
అలాగే షాపింగ్, బ్యూటీ పార్లర్ వీడియోస్ షేర్ చేసుకుంది. అయితే బర్రెలక్క కాబోయే వరుడు ఎవరు, అతడి పేరు కూడా రివీల్ చేయలేదు. కాగా, ఇప్పుడు బర్రెలక్క వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతుంది. ఆమెనే స్వయంగా పెళ్లి కార్డు పోస్టు చేసింది. మార్చి 28న శిరీష వివాహం జరగబోతుంది. ఇంతకు ఆ వరుడు ఎవరంటే. . వెంకటేష్ అట. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి గ్రామం, తెల్క పల్లి మండలం మారెడు బాలకిష్ణయ్య, బక్కమ్మ సంతామని సమాచారం.
ఇదే నిజమైతే.. రానున్న గురువారమే.. శిరీషను వెంకటేష్ అనే వ్యక్తిని మనువాడబోతుంది. కాగా, బర్రెలక్కపై గతంలో పలు రూమర్లు వచ్చాయి. ఆమెకు గతంలో పెళ్లి అయ్యిందని, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని రోజులకే విడాకులు దారి తీసినట్లు తెలుస్తోంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి పల్లవి ప్రశాంత్‌ను వివాహం చేసుకోబోతుందంటూ న్యూస్ రాగా, ఖండించింది శిరీష.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అతడి ఫేస్ రివీల్ చేయడం లేదని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా పెద్ద కొత్త పల్లి మండలానికి చెందిన మరికల్ గ్రామానికి చెందిన నిరుపేద అయిన బర్రెలక్క.. మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. పెద్ద కొత్తపల్లిలో ఈ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.