సెలబ్రెటీల జాతకాలు చెప్పి పాపులర్ అయ్యాడు వేణు స్వామి. సెలబ్రెటీల జాతకాలతో పాటు ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పగలరు ఈయన. ముఖ్యంగా సెలబ్రెటీల విడాకుల గురించి కూడా ముందే చెప్తారు వేణు స్వామి. నాగ చైతన్య విడిపోతారు అని ముందే చెప్పారు వేణు స్వామి. ఆయన చెప్పినట్టుగానే సామ్, చైతన్య విడిపోయారు. దాంతో వేణు స్వామి పేరు మారుమ్రోగిపోయింది.
ఇదిలా ఉంటే కొంతమంది ఆయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. అయితే ఆయన సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వేణు స్వామి నిజస్వరూపం బట్టబయలు అయింది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వేణు స్వామి సీక్రెట్ గా మాంసం తింటాడట. మద్యం కూడా సేవిస్తాడట.
ఈ విషయం ఆయనే స్వయంగా బయటపెట్టాడు. `కొన్ని దేవాలయాల్లో దేవుడికి నైవేద్యంగా మద్యం, మాంసాన్ని పెడతారు. బ్రాహ్మణులు కూడా వాటిని తీసుకుంటున్నారు. అయితే నేను స్వచ్ఛమైన బ్రాహ్మణుల గురించి మాట్లాడడం లేదు. ఇక నేను కూడా రహస్యంగా మద్యం తీసుకుంటాను. మాంసం తింటాను.
అందులో ఎలాంటి తప్పు లేదని నేను భావిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడి పరిస్థితిలకు తగ్గట్టుగా నా అభిరుచులను మార్చుకుంటాను` అంటూ షాకింగ్ విషయాలను రివీల్ చేశాడు. దీంతో వేణు స్వామి కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.