సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ఏమైంది..? ఎమర్జెన్సీ ఆపరేషన్ పై ఆధ్యాత్మిక గురువు ఏమన్నారో వినండి.

17వ తేదీన జగ్గీ వాసుదేవ్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు సీటీ స్కాన్ తీయగా.. మెదడులో ఒకవైపున వాపు ఉన్నట్లు తేలింది. దీనితో ఆయనకు డాక్టర్ వినీత్ సూరి, డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీతో కూడా మెడికల్ టీమ్ బ్రెయిన్ సర్జరీ చేసింది. బ్లీడింగ్‌ను నివారించింది. సర్జరీ తరువాత కొన్ని గంటలపాటు వెంటిలేటర్‌పై ఉన్నారని తెలిపింది.

పూర్తీ వివరాలోకి వెళ్తే ఆధ్యాత్మిక గురువు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ (సద్గురు జగ్గీ వాసుదేవ్) బ్రెయిన్ హెమరేజ్ కారణంగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం జగ్గీ వాసుదేవ్‌ కు మెదడుకు అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. మార్చి 17న సద్గురు మెదడు విపరీతంగా వాచి రక్తస్రావం అయింది.

ఈ నేపథ్యంలో డాక్టర్ వినిత్ సూరి పరిశీలించి ఎంఆర్‌ఐ చేయించాలని సూచించారు. అతని మెదడులో భారీ రక్తస్రావం కనిపించింది. సద్గురు ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. అతను నిరంతరం వాంతులు, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మెదడులో వాపు, రక్తస్రావాన్ని గుర్తించిన తర్వాత అపోలో వైద్య బృందం శస్త్రచికిత్స చేసింది.

డా. వినిత్ సూరి, డా. ప్రణవ్ కుమార్, డా. సుధీర్ త్యాగి, డా.ఎస్ ఛటర్జీలతో సహా ఢిల్లీకి చెందిన అపోలో వైద్యుల బృందం శస్త్రచికిత్స చేసింది. ప్రస్తుతం, సద్గురుని వెంటిలేటర్ నుండి తొలగించారు.ప్రస్తుతం జగ్గీ వాసుదేవ్ కోరుకున్నారు. పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *