బిజినెస్ మాన్ తో పెళ్లికి రెడీ అయిన రష్మి, పెళ్లి ఎప్పుడో తెలుసా..?

గత కొన్ని నెలలుగా రష్మీ పెళ్లి ఇష్యూ పలు రకాలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇప్పటికే యాంకర్ రష్మీ పెళ్లి జరిగిందని, సీక్రెట్‌గా ఆమె కాపురం పెట్టిందని బోలెడన్ని వార్తా సమాచారాలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని క్రమంగా అందరికీ అర్థమైంది. అయితే జబర్దస్త్, డీ షోలతో యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. అందాలు చూపించే రీతిలో అద్భుతమైన వస్త్రధారణతో.. రష్మీ టెలివిజన్ రంగంలో ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ రకంగా యాంకర్ గా మంచి ఇమేజ్ సంపాదించిన రష్మీ.. అదే రీతిలో సినిమా రంగంలో కూడా అవకాశాలు అందుకోవటం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలలో పలు పాత్రలలో కనిపిస్తూ అలరిస్తూ ఉంది. లేటెస్ట్ సమాచారం బట్టి చూస్తే మెగాస్టార్ చిరంజీవి నటించే ఓ సినిమాలో ఐటెం సాంగ్ లో చిరుతో కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు టాక్. ఎంత పక్కన పెడితే రష్మీ పెళ్లికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేమిటంటే ప్రస్తుతం రష్మీ వయసు 34 కావడంతో ఆమెను త్వరగా పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారట. అంతేకాదు కుటుంబ సభ్యులు ఓ బడా బిజినెస్ మాన్ కి పెళ్లి చేయడానికి సిద్ధమైనట్లు.. దీనికి రష్మీ కూడా ఒప్పుకున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. దేశంలోనే వ్యాపార రంగంలో పేరుగాంచిన వ్యక్తితో పెళ్లి జరగనున్నట్లు సమాచారం. త్వరలోనే రష్మీ అధికారికంగా తన పెళ్లి వార్త ప్రకటించనున్నట్లు.. భర్తను కూడా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *