ఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలొ కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైనవారని, వారే గ్రహాంతర వాసులు అంటూ ఉంటారు.వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాలు లేదా గుర్తించబడని ఎగిరే వస్తువుల ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తల నమ్మకం. అయితే గ్రహాంతరవాసులు(ఏలియన్స్) నిజంగా ఉన్నారా? హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ఫ్ల యింగ్ సాసర్లలాంటి ఏలియన్ స్పేస్‌షిప్(యూఎ్‌ఫవో) లు నిజమేనా? అంటే.. అమెరికా ప్రభుత్వానికి చెందిన ‘డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ)’ ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే ఇస్తోంది! ఏలియన్స్ ఉండడమే కాదు..
5 సందర్భాల్లో గ్రహాంతరవాసులు మానవులతో శృంగారం జరిపిన ఘటనలు కూడా నమోదయ్యాయని, ఒక మహిళ ఏలియన్స్ వల్ల గర్భం దాల్చిందని లిఖితపూర్వక నివేదిక సైతం ఇచ్చింది! ఈ విశాల విశ్వంలో ఎక్కడో ఒకచోట మనలాంటి బుద్ధిజీవులు.. మనకన్నా తెలివైన, టెక్నాలజీ పరంగా మరింత ఉన్నతస్థాయిలో ఉన్న జీవులు ఉండొచ్చని ఒక ప్రతిపాదన. ఒకవేళ వాళ్లు మనకన్నా తెలివైనవాళ్లు, మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాళ్లు అయితే మానవజాతి మనుగడకే ముప్పు. అయితే, కొందరు పైలట్లు తాము విమానం నడుపుతున్నప్పుడు యూఎ్‌ఫవోలను చూసినట్టు చెప్పారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తాము ఏలియన్లను, వారి స్పేస్‌షి్‌ప్సను చూశామన్నారు. వీటన్నింటి నేపథ్యంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ.. అడ్వాన్స్‌డ్ ఏవియేషన్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ (ఏఏటీఐపీ) పేరిట 2007 నుంచి 2012 దాకా ఒక ప్రాజెక్టును నిర్వహించింది.
అంటే.. మన వద్ద ఉన్న టెక్నాలజీని మించిన సాంకేతిక పరిజ్ఞానంతో రోదసి నుంచి ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉందేమో అంచనా వేసే ప్రాజెక్ట్ అన్నమాట. డీఐఏ మాజీ చీఫ్ లూయిస్ ఎలిజోండో 2017లో ఈ ప్రాజెక్టు గురించి నోరుజారారు. దీంతో ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వివరాలివ్వాలంటూ సన్ పత్రిక ‘ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్’ కింద డీఐఏని కోరింది. కానీ, వివరాలిచ్చేందుకు డీఐఏ నిరాకరించింది. ఎట్టకేలకు నాలుగేళ్ల పోరాటం తర్వాత ఇటీవలే 1574 పేజీల నివేదికను సమర్పించింది. గ్రహాంతరవాసుల ఉనికిని అందు లో నిర్ధారించింది. అంతేకాదు గ్రహాంతరవాసులు మానవులతో శృంగారం జరిపిన ఘటనలు ఐదు నమోదయ్యాయని, ఒక మహిళ గర్భం దాల్చినట్టు సాక్షులు పేర్కొన్నారని వెల్లడించింది.