ఆధ్యాత్మిక ప్రపంచంలో అతిపెద్ద వేదిక అయిన కోయంబత్తూర్‌లో ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహా శివరాత్రి వేడుకల్లో సింగర్ మంగ్లీకి పాడే అవకాశం లభించింది. మంగ్లీ .. ఒకప్పుడు ఈవిడ కొంత మందికి మాత్రమే సుపరిచితం.ఇప్పుడు మంగ్లీ అంటే ప్రతి ఒక్కరు గుర్తు పడతారు.
జానపద పాటలతో కెరీర్‌ను ప్రారంభించి తన గొంతుతో కోట్లాది మంది ఫాలోవర్లను సంపాదించింది యువ గాయని మంగ్లీ. అల వైకుంఠపురం చిత్రంలో మంగ్లీ పాడిన రాములో రాములా పాట ఏ రేంజ్‌లో రికార్డు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ తర్వాత లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియా పాట వ్యూస్ పంట పండించింది.
ఈ సింగింగ్ సెన్సేషన్ కు సంబంధించిన క్రేజీ అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇటీవల మంగ్లీ పాడిన ఏ పాట అయిన సెన్సేషన్ క్రియేట్ చేయాల్సిందే. తన వాయిస్‌తో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న మంగ్లీ కెరీర్‌లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకెళ్తోంది.