జానపద పాటలు రాయడం, పాటలు పాడటం చేస్తూ సోషల్ మీడియాలో మస్త్పాపులారిటీ సంపాదించుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్. ముఖ్యంగా స్పెషల్ వీడియో సాంగ్స్, ఆల్బమ్స్ చేస్తూ క్రేజ్ సంపాదించుకున్నాడు. అలా యూత్‌లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. హేయ్ పిల్లా, మంగమ్మ, మైసమ్మ, మాక్కికిరికిరీ, పూర్ బాయ్, గల్లీకా గణేష్ ఇలా పలు ఆల్బమమ్స్చేసి ఆకట్టుకున్నాడు. అయితే త్రిబుల్ ఆర్ లో నాటు నాటు సాంగ్ పాడి భారీ పాపులర్ అయిపోయిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న ఓ సింగింగ్ షో కి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
బిగ్బాస్ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాహుల్ సిప్లిగంజ్ కూడా ఒకడు. తన ఆట తీరుతో మరియు మాట తీరుతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం రాహుల్ కి అనేక సింగింగ్ ఆపర్చునిటీస్ దక్కాయి. ఇక వాటిని వినియోగించుకుని ఫుల్ ఫేమస్ అయిపోయాడు రాహుల్ సిప్లిగంజ్. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే హౌస్లో ఉన్న సమయంలో ఓ అమ్మాయి తో కాస్త చనువుగా ఉండేవాడు రాహుల్.
మరి ఆ అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తున్నారా? ఆమె మరెవరో కాదు అశు రెడ్డి. వీరిద్దరూ బిగ్ బాస్ 3 లో పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రాహుల్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. అష్షు రెడీ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..”ఎప్పుడు నా బెస్ట్ ” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ని చూసిన పలువురు షాక్ అవుతున్నారు. అదేవిధంగా ఈ పోస్ట్ ని చూసి రతిక కంపల్సరిగా ఏడుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.