తాజాగా మరోసారి తన జిమ్ వీడియోను షేర్ చేసింది సమంత. ఈమె శ్రమిస్తున్న తీరు చూసి అయ్యో పాపం అంటున్న వాళ్లు కొందరైతే.. అబ్బా ఎంత కష్టపడుతుందిరా బాబూ.. ఈ మాత్రం చేస్తుంది కాబట్టే ఆ రేంజ్ ఫిట్‌గా ఉందంటున్నారు మరికొందరు. మయోసైటిస్ బారిన పడిన తర్వాత సమంతలో చాలా మార్పులు వచ్చాయి.
దానికి ముందే విడాకులతో మానసికంగా కృంగిపోయిన స్యామ్‌కు మయోసైటిస్ మరింత దెబ్బ తీసింది. తాను మెంటల్‌గా చాలా వీక్ అయిపోయానని.. అందుకే ఓ సమయంలో రోజుల తరబడి ఏడుస్తూనే కూర్చున్నానని.. ఒంటరిగా నరకం చూసానని చెప్పింది ఈ బ్యూటీ. ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడటానికి శరీరానికి ఎక్కువగా పని చెప్తుంది ఈ బ్యూటీ.
ఆరోగ్య సూత్రాలను కూడా తూచా తప్పకుండా పాటిస్తుంది. దానికి తోడు ఫుడ్ విషయంలోనూ చాలా మార్చుకుంది సమంత. తన డైట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు కూడా. మయోసైటిస్ కారణంగా కోల్పోయిన ఇమ్యూనిటీ పవర్ తిరిగి తెచ్చుకుంటుంది స్యామ్. దానికోసమే రాత్రింబవళ్లు చెమటలు కక్కుతూ జిమ్‌లోనే గడిపేస్తుంది.