పవిత్రనాథ్‌పై రెండేళ్ల క్రితం అతడి భార్య శశిరేఖ సంచలన ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి అని తెలిపింది. జాతకం పేరుతో అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకువచ్చేవాడని.. ఇదేంటని ప్రశ్నిస్తే తనను కొట్టేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాక తనతో వివాహం అయిన తర్వాత కూడా ఓ అమ్మాయితో 8 ఏళ్ల పాటు సంబంధం పెట్టుకుని తనను మోసం చేశాడని శశిరేఖ ఆరోపించింది. ప్రతి రోజు తాగొచ్చి టార్చర్ పెడతాడని.. అతడు ఏ సీరియల్స్‌లో నటిస్తున్నాడో అనే విషయం కూడా తనకు చెప్పడని..
పదేళ్ల నుంచి తాను నరకం చూస్తున్నానని వెల్లడించింది. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అయితే దీనిపై పవిత్రనాథ్ ఎక్కడా స్పందించలేదు. ఆ తర్వాత అతడు సీరియల్స్‌కు కూడా పూర్తిగా దూరమయ్యాడు. సోషల్ మీడియాలో కూడా చాలా అరుదుగా కనిపిస్తుంటాడు. అయితే భార్య ఆరోపణలు, చేతిలో పని లేకపోవడం వల్ల అతడు మానసికంగా కృంగి పోయాడని..
చాలా కాలం నుంచి ఇండస్ట్రీ మిత్రులతో కూడా దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ఈక్రమంలోనే అతడు ఆకస్మాత్తుగా మృతి చెందాడు. అయితే అనారోగ్య సమస్యలా.. లేక వ్యక్తిగత కారణాల వల్ల ఇలా జరిగింది అనేది మాత్రం తెలియలేదు. ఇక పవిత్రనాథ్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు స్పందించి అధికారిక ప్రకటన చేస్తే.. దీనిపై ఓ క్లారిటీ వస్తుంది.