పవన్‌ కల్యాణ్‌ పెట్టుకున్న ఈ వాచ్‌ అమ్మితే మీ లైఫ్ సెటిలైపోద్ది, దీని ధర ఎంతో తెలుసా..?

జనసేనాని, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది. ఒరిజినల్ వెర్షన్ తెరకెక్కించిన యాక్టర్ కమ్ డైరెక్టర్ పి.సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. జీ5 సంస్థతో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. అయితే దీంతో నెట్టింట ప్రస్తుతం బ్రో మేనియా నడుస్తోంది. దీనికి తగ్గట్టుగానే పవన్‌, తేజ్‌ల పోస్టర్స్‌, మేకింగ్‌ వీడియోలను రిలీజ్‌ చేస్తూ పై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్‌.

కాగా ప్రమోషన్లలో భాగంగా బ్రో ప్రి రీలీజ్ ఈవెంట్ మంగళవారం శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగింది. సాయి ధరమ్ తేజ్‌, వరుణ్‌ తేజ్‌, కేతికా శర్మ, ప్రియా ప్రకాష్, సముద్రఖని, బ్రహ్మానందం తదితర సెలబ్రిటీలందరూ ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. ఇక ఎప్పటిలాగే తనదైన స్పీచ్‌తో అదరగొట్టేశారు పవన్‌. అయితే ఈ ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్‌ పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో దాని బ్రాండ్‌ అండ్‌ కాస్ట్‌ డీటెయిల్స్‌ గురించి నెటిజన్లు తెగ ఆరాతీశారు. బ్రో ఈవెంట్లో పవన్ కల్యాణ్‌ ధరించిన వాచ్‌ బ్రెగ్యుట్‌ మైరెన్‌ క్రోనోగ్రాఫ్‌.

ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాచుల్లో ఒకటి. దీని ధర సుమారు రూ. 21,45,678 లని తెలుస్తోంది. ఇది చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. ‘పవర్‌ స్టార్‌.. అంటే ఆ మాత్రం రేంజ్‌ ఉండాలి’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు .అలాగే అత్తారింటికి దారేదిలో పవన్‌ చెప్పిన డైలాగ్‌ ‘ వాచ్‌ అమ్మితే బ్యాచ్‌ సెటిలైపోద్ది’ను గుర్తుచేసుకుంటున్నారు. కాగా బ్రో మూవీకి థమన్‌ స్వరాలు సమకూర్చారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ సమకూర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *