బాలకృష్ణ సినిమాలు అంటేనే తొడకొట్టడం, పవర్‌ఫుల్ డైలాగులతో విలన్స్‌కు వార్నింగ్ ఇవ్వడం.. అందుకే ముందుగా ‘సమరసింహారెడ్డి’ రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో ముందుగా తొడకొట్టి తన స్పీచ్‌ను మొదలుపెట్టారు నందమూరి చైతన్య కృష్ణ. ఈ సినిమా కోసం దర్శకుడు బీ గోపాల్, పరుచూరి బ్రదర్స్ కలిసి ఎంత పవర్‌ఫుల్ డైలాగులు రాశారు గుర్తుచేసుకున్నారు.
అంతే కాకుండా ‘నీ ఇంటికి వచ్చా’ అంటూ డైలాగ్ కూడా చెప్పారు. బీ గోపాల్, బాలకృష్ణ కాంబినేషన్ ఎప్పుడూ హిట్టే అని వారి కాంబోలో వచ్చిన చిత్రాల గురించి మాట్లాడారు. కానీ అన్ని సినిమాల్లో ‘సమరసింహారెడ్డి’ అనేది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చైతన్య కృష్ణ అన్నారు.
ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇది మొదటి యాక్షన్ మూవీ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ‘లారీ డ్రైవర్’ సినిమాలోని ఒక డైలాగును గుర్తుచేసుకుంటూ కొడాలి నానిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.