దానికి ఒప్పుకోకపోతే ఇండస్ట్రీలో ఛాన్సులు రావు, ఇంటర్వ్యూలో అన్ని ఒప్పుకున్న నటి సత్య.

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటి సత్య కృష్ణన్ గారి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. పాతికేళ్లుగా ఆమె తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. టాలీవుడ్ లో వొదిన, అక్క, తల్లి ఇలా ఎన్నో రకాల పాత్రల్లో నటి మెప్పించారు. ఎక్కవగా కామెడీ పాత్రల్లో నటించారు.

డాలర్ డ్రీమ్ తో కెరీర్ ప్రారంభించిన సత్య తర్వాత ఆనంద్, బొమ్మరిల్లు మూవీస్ తో బాగా పేరు సంపాదించుకుంది. ఆమె నటన, హస్కీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా వరకు మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు సత్య. తాజాగా తన పర్సనల్ విషయాలు, క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు.

మా కుటుంబంలో అందరూ ఉద్యోగాలు చేసేవారే.. ఇండస్ట్రీ వైపు నేను మాత్రమే వచ్చాను. నా భర్తది తమిళ కుటుంబం. పెళ్లైన తర్వాత సినిమాలు చేస్తానంటే మా అత్తింటి వాళ్లు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కెరీర్ బిగినింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాను. అయినా కూడా వాటన్నింటిని ఎదుర్కొని ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. నాకు నచ్చిన పాత్రల్లోనే నటిస్తాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *