బాలీవుడ్ లో కూడా రకుల్ కి కలసి రాలేదు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి.. తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందింది. కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఆ తరువాత తెలుగులో పరిచయం అయింది ఈ భామ. అయితే, కొంతకాలం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి.. ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి అని చెప్పి తీరాలి.
కాగా, గతంలో రకుల్, నిర్మాత జాకీ భగ్నానీతో డేటింగ్ లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా వీరిద్దరూ పలు సందర్భాల్లో జంటగా కనిపించారు. దీనితో అప్పట్లో వీరివురు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు తెగ వినిపించేవి. అయితే, తాజాగా రకుల్ వాటిని నిజం చేస్తుందని మరో వార్త వినిపిస్తోంది.
పైగా, వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ ను ప్లాన్ చేయనున్నారని.. వీరి వివాహానికి డేట్ కూడా ఫిక్స్ చేశారనే సమాచారం వినిపిస్తోంది. 2021లో ఈ భామ తన ప్రియుడిని అందరికి పరిచయం చేసింది. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. ఇక 2024లో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మధ్యలో గోవా వేదికగా వీరి వివాహం జరగనుందట. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో వేచి చూడాల్సి ఉంది.