సీనియర్ హీరోయిన్ గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతోంది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 16న రాత్రి దక్షిణ కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేర్చారు. శనివారం ఉదయం కోల్‌కతాలో 79 ఏళ్ల అంజనా తుదిశ్వాస విడిచింది. అంజనా భౌమిక్ మరణించిన సమయంలో, ఆమె కుమార్తె నీలాంజనా, అల్లుడు జిషు సేన్‌గుప్తా ఆసుపత్రిలో ఆమెతో ఉన్నారు. నివేదికల ప్రకారం, అంజనా భౌమిక్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు.
అయితే సీనియర్ హీరోయిన్ అంజనా భౌమిక్(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అంజనా భౌమిక్ శ్వాసకోస సమస్యతో బాధ పడుతున్నారు. ఈక్రమంలోనే ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. శనివారం అంజనా ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. అంజనా భౌమిక్ అసలు పేరు ఆరతి. కూచ్ బిహార్‌లో ఆమె జన్మించారు. చదువు కోసం కోల్‌కతా వెళ్లిన ఆమె అక్కడే స్థిరపడి పోయారు.

సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అంజనా ‘అనుస్టూప్ ఛంద’ అనే చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ‘థానా థేకే అస్చీ’ బెంగాలీ చిత్రంలో స్టార్ డమ్ పొందిన ఆమెకు ఆ తరువాత వరుస సినిమాల ఆఫర్లు వచ్చాయి. ‘కహోనా మేఘ్’, ‘థానా థేకే అస్చీ’, ‘చౌరంగీ’ లాంటి క్లాసిక్ సినిమాల్లో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు అంజనా భౌమిక్. అప్పట్లో అంజనా అందానికి, నటనకు యువత ఫిదా అయ్యారు.