నల్గొండ బహిరంగ సభకు వెళ్తుండగా కేటీఆర్, హరీష్ తోపాటు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయాణిస్తున్న బస్సును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో లంచ్ ముగించుకొని బహిరంగసభకు బయలుదేరిన సమయంలో… కేటీఆర్, హరీశ్ లు ప్రయాణిస్తున్న బస్సును యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులకు ఊహించని నిరసన ఎదురయింది.
వారు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి జరిగింది. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సాయంత్రం భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్ రావులతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తున్న బస్సును ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్లచొక్కాలను ధరించి బీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేశారు.
బస్సుపై కోడిగుడ్లను విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గోబ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు అక్కడి నుంచి ముందుకు సాగారు. కాసేపటి క్రితం వీరు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.