ఆంధ్ర యూనివర్సిటీ జూబ్లీ గ్రౌండ్లో జరుగుతున్న ఆడుదాo ఆంధ్ర ..కబడ్డీ పోటీలను మంత్రి రోజా వీక్షించడంతో పాటు కబడ్డీ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రానికి ఏమీ లేకుండా పోయిందని.. క్రీడలను ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.
అయితే తాజాగా ఆడుదాం ఆంధ్రా కబడ్డీ పోటీల సందర్భంగా రోజా మరోసారి జగన్ పై అభిమానాన్ని చాటుకున్నారు. కబడ్డీ బరిలో దిగిన మంత్రి రోజా… “కబడ్డీ, కబడ్డీ” అని కూత పెట్టేందుకు బదులుగా “ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024)… జగనన్న వన్స్ మోర్” అంటూ కూత పెట్టారు. అనంతరం, కూతకు వచ్చిన ప్రత్యర్థి రైడర్ ను క్యాచ్ పట్టి మురిసిపోయారు.
మధ్యలో ఓసారి వెనక్కి తిరిగి కాలెత్తి లెగ్ టచ్ కోసం ప్రయత్నం చేశారు. దాంతో ఆ కబడ్డీ మ్యాచ్ చూస్తున్న వారు అరుపులు, కేకలతో రోజాను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.