సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాక్టర్స్ లో కృతి శెట్టి ఒకరు. ఎప్పుడు లేటేస్ట్ ఫోట్ షూట్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది కృతి. తాజాగా ఈ బ్యూటీ బెల్లీ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. బీస్ట్ మూవీలోని అరబిక్ కుతు పాటకు సన స్నేహితురాలితో కలిసి బెల్లీ డాన్స్ ఇరగదీసింది.
అయితే ఎప్పుడు వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తున్న కృతి.. ఈసారి బెల్లీ డాన్స్ వీడియో షేర్ చేసింది. విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు పాటకు సన స్నేహితురాలితో కలిసి బెల్లీ డాన్స్ అదరగొట్టేసింది. ఎంతో సింపుల్ స్టెప్స్ వేస్తూ మెస్మరైజ్ చేసింది. అందంతోపాటు.. ఈ బ్యూటీ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
బేబమ్మ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుండగా.. కృతి అదరగొట్టేసిందని.. బేబమ్మ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కృతి బెల్లీ డాన్స్ మీరు చూసేయ్యండి.