ఆర్తి అగర్వాల్ చనిపోయే ముందు ఎంతలా టార్చర్ పెట్టారో చుడండి.

ఆర్తి అగర్వాల్ మార్ఛి 5వ తేదీన అగర్వాల్ నందినిగా అమెరికాలోని గుజరాతీ కుటుంబంలో జన్మించారు. తండ్రి శశాంక్ వ్యాపారవేత్త, తల్లి వీమా గృహిణి. అమెరికాలో సునీల్ శెట్టి పర్యటించిన సమయంలో ఆర్తీ అగర్వాల్‌ను వేదికపైకి పిలిచి డ్యాన్స్ చేయించడంతో ఆమెలో సినీ తార కావాలనే కోరిక కలిగింది. అందుకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించడంతో ఆమె కల సాకారమైంది. అయితే ఆర్తి అగర్వాల్.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని రూపం. ‘నువ్వు నాకు నచ్చావ్’ అంటూ 16 ఏళ్ల వయసులో టాలీవుడ్ వెండితెరపై సందడి చేసింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.

ఇంకేముంది.. ఆమె ముందు వరుస అవకాశాలు క్యూకట్టాయి. మొదటి సినిమాతోనే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‏తో జతకట్టిన ఆర్తి… ఆ తర్వాత ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా ఇంద్ర సినిమాలో చిరంజీవికి ప్రేయసిగానే కాదు.. ఎదురించే ప్రతినాయికగానూ ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకుని.. టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన ఆర్తి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయింది.

నిండైన రూపం.. చక్కని చిరునవ్వుతో కోట్లాది ప్రేక్షకులను అలరించిన ఆర్తి నిజ జీవితంలో మాత్రం ఎంతో విషాదం దాగుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ప్రేమ, పెళ్లంటూ వచ్చిన రూమర్స్‏తో విసిగి 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఏడాది.. మెట్లపై నుంచి పడి ఆసుపత్రిలో చేరింది. ఇక ప్రేమే కాదు.. పెళ్లి సైతం ఆమె జీవితంలో ఎక్కువ రోజులు కొనసాగలేదు. 2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ ను పెళ్లి చేసుకున్నారు ఆర్తి. ఆ తర్వాత కొంత కాలంగా వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. అయితే చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆర్తి అగర్వాల్ రీఎంట్రీ సైతం పెద్ద సక్సెస్ కాలేదు.

పలు చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపించినప్పటికీ అంతగా హిట్ కాకపోవడంతో.. ఆర్తికి అవకాశాలు రాలేదు. తెలుగులో మొత్తం 50కి పైగా చిత్రాల్లో నటించింది ఆర్తి అగర్వాల్. అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆర్తి.. బరువు తగ్గేందుకు తీసుకున్న నిర్ణయమే ఆమె ప్రాణాలను తీసింది. స్థూలకాయం, శ్వాసకోస సమస్యలతో బాధపడిన ఆమె.. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. చికిత్స వికటించడంతో గుండెపోటు వచ్చి ఇన్ఫెక్షన్ రావడంతో జూన్ 6న ఆర్తి అగర్వాల్ కన్నుమూసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *