హీరోలుగా సినీ జనాలు ఆదరిస్తారు వాళ్ళు మెయింటెన్ చేసే స్టైల్ నీ కూడా అభిమానులు ఫాలో అవుతారు.అయితే మన తెలుగు హీరోలు వైట్ గా ఉంటూ చూడడానికి బలంగా ఉన్నప్పటికీ హెయిర్ మాత్రం తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళలో చాలా మంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు విగ్గులు వాడతారని సమాచారం. కొంతమంది హీరోలు విగ్గులు వాడటం గురించి బహిరంగంగా వెల్లడిస్తుంటే మరి కొందరు హీరోలు మాత్రం ఈ విషయాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదు.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతి సినిమాలో కొత్త లుక్ తో కనిపిస్తారనే సంగతి తెలిసిందే. అయితే బాలయ్య ఈ విధంగా ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపించడానికి ఆయన విగ్గులే కారణం కావడం గమనార్హం. అయితే విగ్గు వల్లే ఫ్లాప్ అయిన బాలకృష్ణ సినిమాలు కూడా ఉండటం గమనార్హం. మరో స్టార్ హీరో మహేష్ బాబు కూడా విగ్గు వాడతారని చాలామంది భావిస్తారు. మహేష్ కొత్తరకం విగ్గులను వాడుతూ విగ్గు వాడుతున్నామనే అనుమానం కలగకుండా చేస్తున్నారని తెలుస్తోంది. మరో స్టార్ హీరో ప్రభాస్ కూడా విగ్ వాడుతున్నారని సమాచారం.
బాహుబలి సిరీస్ సినిమాలలో ప్రభాస్ విగ్గుతోనే కనిపించారని భవిష్యత్తు సినిమాల విషయంలో కూడా ప్రభాస్ ఇదే నిర్ణయాన్ని ఫాలో కానున్నారని సమాచారం అందుతోంది. హీరో రామ్ కూడా విగ్గు వాడతాడని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. హీరో నాగార్జున సైతం విగ్ వాడుతున్నారని సమాచారం అందుతోంది. మెగాస్టార్ చిరంజీవి సైతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత విగ్గు వాడుతున్నారని సమాచారం. గోపీచంద్, సుమంత్, మరి కొందరు హీరోలు కూడా విగ్గులు వాడతారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. విగ్గులు వాడటం వల్ల టాలీవుడ్ స్టార్ హీరోలకు మంచి జరుగుతోందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.