కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో కాంగ్రెస్ ను ఓడించటం ఖాయమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ మంచికే జరిగిందంటూ కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు చూసి జనం మోసపోయారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారన్నారు.100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ను బొంద పెట్టుడే అని హెచ్చరించారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లంకె బిందెలు కోసం దొంగలు తిరుగుతారని.. గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చు నాకైతే తెలియదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి లాగా తాము తిట్టగలుతామని అన్నారు. మొన్న జరిగిన ఫలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్నానని అన్నారు. చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని.. నికృష్ట కాంగ్రెస్ పాలన కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడే జనానికి తెలుస్తుందని కేటీఆర్ అన్నారు.