కొద్దిసేపటి క్రితం పూనమ్ పాండే అధికారిక instagram అకౌంట్లో చేసిన పోస్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. 2013లో నషా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పూనమ్ పాండే అనేక వివాదాలకు కేరాఫ్ అయ్యారు. ఆమె నేడు మరణించిందని, ఆమె గర్భాశయ క్యాన్సర్ బారిన పడ్డారని, దానితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని,
ఈరోజు అత్యంత బాధాకరమైనదిగా అభివర్ణిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు పూనమ్ పాండే అభిమానులకు విషాదంగా మారింది.దాంతో బాలీవుడ్ సెలబ్రిటీలంతా నిర్ఘాంతపోయారు. ఆమె మరణవార్తపై నివాళులు తెలుపుతూ కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు. సోషల్ మీడియాలో రిప్ పూనమ్ పాండే పేరుతో ట్రెండింగ్ కూడా అయింది.
మరోవైపు ఎంతో ఫిట్‌గా చలాకీగా ఉండే పూనమ్ పాండే ఆకస్మికంగా చనిపోవడం ఏంటీ అంటూ పలువురు నెటిజన్స్ క్వశ్చన్ చేస్తూ ఆరా తీశారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయిండొచ్చు అని కామెంట్స్ సైతం చేశారు.