గత రెండు మూడు రోజుల నుంచి #kumriaunty ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం. రుచికరమైన భోజనం అందుబాటు ధరలో అందించడంతో ఫేమస్‌గా మారింది కుమారి ఆంటీ. దీంతో అనేక మంది ఆమె ఫుడ్ స్టాల్ వచ్చి లంచ్ చేస్తున్నారు. అయితే కుమారీ ఆంటీ అసలు పేరు దాసరి కుమారి. కైకలూరు సమీపంలోని తారమకొల్లులో పుట్టారట.
4వ తరగతి వరకు చదువుకున్నారు. ఇంట్లో ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో తల్లిదండ్రులతో పొలం పనులకు వెళ్లేవారట. పొలం పనులతో పాటు గుడివాడ మాంటిస్సోరి స్కూల్‌లో టైలరింగ్ నేర్చుకున్నారట. అలా టైలరింగ్ నేర్చుకునే క్రమంలో తనను చూసి ఇష్టపడి వ్యక్తి ఇంట్లో వారితో మాట్లాడి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లాడారట.
తాజాగా వీరి ప్రేమ కథ మీడియాలో వైరల్ అవుతోంది. కుమారి ఆంటీకి 2004 లో పెళ్లైందట. వారికి కుమారుడు, కుమార్తె ఇద్దరు పిల్లలు.