సురేఖ వాణి కూతురుగా అందరికీ తెలిసిన సుప్రిత చాలా రోజులుగా సినిమాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను వదులుతూ కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ… తన ఉనికిని చాటుకుంది. నెట్టింట ఫుల్ వైరల్ అయి.. తన అందం, అభినయంతో సినిమాల్లోకి రావాలని గట్టిగా ట్రై చేసిన ఈమె కష్టానికి ఫలితం దక్కింది. త్వరలోనే ఈమెను మనం వెండితెరపై చూసేయచ్చు.
ముఖ్యంగా ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఈ ముద్దుగుమ్మ తాను సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలిపింది. అయితే బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ హీరోగా ఒక చిత్రం ప్రారంభం అయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సుప్రీతని ఎంపిక చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి సురేఖ వాణి కూడా హాజరయ్యారు. సురేఖ వాణి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అమర్ దీప్ తనకి తమ్ముడు లాంటోండు అని సురేఖ వాణి పేర్కొంది.
అలాగే తన కుమార్తెని ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి చాలా భయపడినట్లు సురేఖ వాణి పేర్కొంది. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి అందరి తల్లుల లాగే తాను కూడా భయపడినట్లు తెలిపింది. అయితే ఇంత మంచి టీమ్ దొరికినందువల్ల తాను ధైర్యంగా తన కుమార్తెని వారి చేతుల్లో పెడుతున్నట్లు సుప్రీత పేర్కొంది.