పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు స్పష్టంగా తెలుసని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడో వంతు సీట్లు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంటే 58 సీట్లను జనసేనకు ఇవ్వాల్సిందేనన్నారు జనసేనాని. ఈ పొత్తు అసెంబ్లీ ఎన్నికలతో ఆగిపోకూడదని.. ఎన్నికల తర్వాత కూడా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
పవన్ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమను సంప్రదించకుండా.. ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. అరకు, మండపేట స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా.. పోటీ పవన్ కళ్యాణ్ కూడా రెండు స్థానాల్లో అభ్యర్థులను అనౌన్స్ చేశారు.
తనకు ఇష్టమైన అక్షరం ఆర్.. అని రిపబ్లిక్ డే సందర్భంగా రాజోల్, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు. చంద్రబాబుకు ఉన్న ఒత్తిడితో అభ్యర్థులను ప్రకటించారని.. తనకు కూడా ఉన్న ఒత్తిడి కారణంగా ప్రత్యేక కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.