బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి చెప్పేదేముంది. గ్లామర్, చలాకీతనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్. అందంతో కుర్రాళ్లని అట్రాక్ట్ చేస్తూనే.. స్పీకర్లు పగిలిపోయేలా గోల చేయడం ఆమె శైలి. అందుకే శ్రీముఖి పాల్గొనే షోలలో పెద్ద హంగామా ఉంటుంది. అయితే అయితే ఈ ప్రోమోలో జడ్జ్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్, శ్రీముఖితో ఓ పాటకు డాన్స్ చేస్తూ.. అలా ఓ సైగా చేస్తాడు. దీంతో శ్రీముఖి రెస్పాండ్ అవుతూ..
ఈ తుంటరి అబ్బాయి ఇలా చేస్తాడని అప్పుడే అనుకున్నానని.. అయితే తాను మీతో ప్రేమలో లేనని.. రాహుల్ సిప్లీగంజ్ ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. దీనికి సంబందించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక మరోవైపు శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె కొన్నాళ్లుగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందట. ఈ నేపథ్యంలో ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

మరో రెండు నెలల్లో శ్రీముఖి గుడ్ న్యూస్ చెప్ప నుందని తెలుస్తోంది. వచ్చే వేసవిలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఎప్పటి నుంచో ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి.