తేజ సజ్జ ముందు సవాళ్ల వలయం, ప్రస్తుతం ఆ తేడా మీరే చుడండి.

హనుమాన్ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీనికితోడు గుంటూరు కారం మూవీకి మిక్స్‌డ్ టాక్ రావడం, అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంలాంటివి కూడా హనుమాన్ మూవీకి కలిసి వచ్చాయి. దీంతో తొలి వారంలో అంచనాలకు మించి ఈ సినిమా వసూళ్లు చేసింది. నార్త్ లోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఇకపై అసలు సవాల్ ఎదురుకానుంది. అదే కథల ఎంపిక. క్రేజీ కాంబోల ఉచ్చులో పడి డైరెక్టర్ల బ్రాండ్ ని గుడ్డిగా నమ్మితే ఎలాంటి సమస్యలు వస్తాయో చరిత్ర చాలా సార్లు ఋజువు చేసింది.

భక్తి ఫాంటసీలు చేయకపోయినా ఒకప్పుడు తరుణ్, వరుణ్ సందేశ్ లాంటి వాళ్ళు ఇంతే స్థాయిలో విజయాలు చవి చూశారు. ఓవర్ నైట్ స్టార్లయ్యారు. కానీ కెరీర్ ప్లానింగ్ లో చేసిన పొరపాట్లు తగిన మూల్యాన్ని చెల్లించేలా చేశాయి. ఒకప్పుడు యూత్ స్టార్ అవుతాడనుకున్న రాజ్ తరుణ్ సోలోగా అవకాశాలొస్తున్నా ప్రస్తుతం నా సామిరంగ లాంటి వాటిలో లెన్త్ తక్కువున్న పాత్రలకు ఓకే చెబుతున్నాడు. తేజ సజ్జ ఎంత జాగ్రత్తగా ఉంటాడనేది భవిష్యత్తుని శాశిస్తుంది. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో తను ఎక్కువగా ఉండకపోవచ్చని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆల్రెడీ హింట్ ఇచ్చాడు.

కాకపోతే భవిష్యత్తులో సినిమాటిక్ యునివర్స్ ని కలిపే క్రమంలో మళ్ళీ తేజ సజ్జని తీసుకుంటాడు. ఇద్దరి మధ్య జాంబీ రెడ్డి ముందు నుంచే స్నేహం ఉంది. వీళ్ళ సంగతి పక్కనపెడితే త్రినాధరావు నక్కినతో తేజ సజ్జ ఒక సినిమా ఒక చేశాడని ఇన్ సైడ్ టాక్. పెద్ద బడ్జెట్ తోనే ప్లాన్ చేశారట. ఈ రెండు కాకుండా తేజ సజ్జ ఖచ్చితంగా ఒప్పుకున్నవి ఏవి లేవు. హనుమాన్ హడావిడి అయ్యాక కథలు చెప్పేందుకు డైరెక్టర్ల క్యూ ఎదురుచూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *