ట్వింకిల్ ఖన్నా 50 సంవత్సరాల వయస్సులో లండన్ విశ్వవిద్యాలయం నుండి ఫిక్షన్ రైటింగ్ మాస్టర్ ప్రోగ్రామ్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఈ రోజున, ఆమె గ్రాడ్యుయేషన్ రోజు నుండి ఒక చిన్న వీడియో, ఫోటోలను పంచుకోవడానికి ఆమె ఇన్ స్టా ప్రొఫైల్‌కు వెళ్లింది. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా.. తాజాగా మాస్టర్స్ పూర్తిచేసింది. 50 ఏళ్ల వయసులో లండన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసలు కురిపిస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు హీరో అక్షయ్.
తాను ఓ సూపర్ ఉమెన్ను పెళ్లి చేసుకున్నానని తనకు అప్పుడే తెలుసని.. ఇల్లు, కెరీర్, పిల్లలు అన్నింటిని చూసుకుంటూ మళ్లీ విద్యార్థిగా మారి చదువు ప్రయాణం కొనసాగించి విజయం సాధించావంటూ నోట్ షేర్ చేస్తూ.. తన భార్య మాస్టర్స్ తీసుకున్న ఫోటోను పంచుకున్నాడు. “రెండు సంవత్సరాల క్రితం మీరు మళ్లీ చదువులు చదవాలనుకుంటున్నారని మీరు నాతో చెప్పినప్పుడు.. మీ నిర్ణయం తెలిసి ఆశ్చర్యపోయాను.
కానీ మీరు చాలా కష్టపడి ఇల్లు, కెరీర్, నన్ను, పిల్లలను చూసుకుంటూ.. మళ్లీ పూర్తిస్థాయి విద్యార్థిగా జీవితాన్ని మేనేజ్ చేయడం చూశాకా.. నేను ఒక సూపర్ ఉమెన్ ను వివాహం చేసుకున్నానని నాకు తెలుసు” అంటూ భావోద్వేగ పోస్ట్ చేశాడు. “ఈ రోజు మీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా, టీనా మీరు నన్ను ఎంత గర్వించే భర్తను చేసారో చెప్పడానికి తగినన్ని పదాలు తెలుసుకోవడానికి నేను కొంచెం ఎక్కువ చదువుకోవాలనుకుంటున్నాను. అభినందనలు మై లవ్” అంటూ రాసుకొచ్చారు.