తాజాగా సాయి పల్లవి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా మెడలో దండలు ఉన్న ఫోటో ఒకటి బాగా సర్క్యులేట్ అవుతోంది. ఇన్నాళ్లు ఫ్యామిలీ విషయాలు పంచుకునే పూజా కన్నన్.. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. “ఈ క్యూట్ బటన్ నిస్వార్థమైన ప్రేమ, ఓపికగా ఉండడం.. ఎప్పుడూ ప్రేమతో ఉండడం నేర్పించింది.
ఇతను వినీత్.. నా సన్ షైన్. మొన్నటి వరకు నా క్రైం పార్ట్ నర్. ఇప్పుడు నా లైఫ్ పార్ట్ నర్ కాబోతున్నాడు. ఐ లవ్ యూ మై పార్ట్ నర్” అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది పూజా. దీంతో ఆమెకు సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందంటూ అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే వాటిపై న్యాచురల్ బ్యూటీ స్పందించలేదు. దీంతో సాయిపల్లవి పెళ్లి వార్తలు రూమర్స్ గానే ఉండిపోయాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆమె చెల్లెలు పెళ్లి కబురు అందించింది. ప్రేమమ్ సినిమాతో కథానాయికగా పరిచయమైన సాయి పల్లవి.. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. కంటెంట్.. పాత్ర ప్రాధాన్యత ఉంటేనే సినిమాలను ఒప్పుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె తండేల్ చిత్రంలో నటిస్తుంది. చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.