గెలుపు కోసం పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో బిజీ అయితే.. ఎమ్మెల్యేలు, ఆశావాహులు అంతా సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే అధికార వైసీపీ కి ఈ సారి వర్గ పోటు తప్పడం లేదు. దాదాపు చాలా నియోజకవర్గాల్లో సీటు కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడే పరిస్థితి ఉంది. ఈ సారి సిట్టుంగుల్లో చాలామందికి సీటు కష్టమే అంటున్నారు.
ఇటీవల ఎమ్మెల్యేలతో సలు సార్లు సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. అప్పుడే క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.. దాదాపు 40 మందికి పైగా సిట్టుంగులు తమ గ్రాఫ్ పెంచుకోకుంటే సీటు లేదని వారి మొహం మీదే చెప్పేశారు అంటున్నారు. దీంతో ఆయా సీట్లలో ఆశావాహులు తమ ప్రయత్నాలు పెంచారు.
ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబుకి కూడా షాక్ తప్పదా అనే ప్రచారం ఉంది. ఆయన్ను సత్తెనపల్లి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం సంగతి ఎలా ఉన్నా..? సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు షాక్ తగిలింది.