ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ హంగామా చేశారు. తాను సీఎం జగన్ ని కలవాలని సెక్యూరిటీని అడిగారు. అయితే అనుమతి లేదని బయటనే ఆపేశారు. దీంతో అక్కడే కేఏపాల్ నిరీక్షించారు. చివరి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటంతో మీడియాతో తన అసహనాన్ని వెల్లగక్కారు.
అయితే ఎంతో మంది దేశాధినేతలు తాను అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారని కేఏ పాల్ అన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం తనకు అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చారని.. కానీ కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80 సార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదన్నారు.
తనకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ చివరకు మాజీ సీఎం అయ్యారని గుర్తుచేశారు. ఆయన మాజీ సీఎం అయ్యాకే తనకు అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు. ఒకవేళ జగన్ కూడా తనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేసీఆర్ తరహాలోనే జగన్ మాజీ సీఎం అవుతారని కేఏ పాల్ జోస్యం చెప్పారు.