హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాతోనే వెంకటేష్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. వెంకీ మామ కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 75వ సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే విక్టరీ వెంకటేష్ నటించిన 75వ సినిమా సైంధవ్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 13న విడుదలవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో నిన్న ఆదివారం ఘనంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు సినిమా టీమ్.
ఇక ఈ ఈవెంట్‌లో ఎప్పటిలానే వెంకీ మామ ఫుల్ ఎనర్జీతో స్పీచ్ ఇచ్చారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ముందుగా అందరికీ కృతజ్ఞతలు చెప్పిన వెంకటేష్..’ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు.. అక్కా.. చెల్లి ..అమ్మ.. నాన్న.. తమ్ముడు.. అన్నా ఇలా అందరూ ఈ సినిమాను చూడాలి’ అని కోరాడు. ‘నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. నా చిత్రాలు చాలా వరకు వైజాగ్ లోనే షూటింగ్ జరుపుకున్నాయి. సైంధవ్ సినిమా కూడా ఎక్కువ భాగం ఇక్కడే స్టీల్ ప్లాంట్‌లో షూట్ చేశాం.
కుటుంబం అంతా కలిసి చూసే చిత్రమిది. దర్శకుడు ఈ సినిమాని చాలా కొత్తగా తీశాడు. ధర్మచక్రం, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఇలా నా చిత్రాలు ఎన్నో ఆదరించారు. ఈ సినిమా సంక్రాంతి పండక్కి వస్తుంది. సినిమా చూసి ఆడవాళ్లు కచ్చితంగా ఏడుస్తారు. ఈ సినిమాకు సారా పాపే హీరో. తాను చాలా అద్భుతంగా నటించింది. లైఫ్‌ను చాలా సీరియస్‌గా తీసుకోవద్దు. అందరికీ అన్నీ వస్తాయ్.. ఆ దేవుడు ఇస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.