అనూజను వివాహం చేసుకున్న తర్వాత అవినాష్ ఆమె బంధాన్ని అందంగా కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా ఇద్దరూ కలిసి యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు కూడా చేస్తున్నారు. దీంతో వీళ్లిద్దరూ బెస్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. ఇక, ఇటీవలే అనూజ ప్రెగ్నెంట్ కూడా అయింది. అయినప్పటికీ ఆమె యూట్యూబ్‌లో ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోలను అప్‌లోడ్ చేస్తూనే ఉంది. అయితే జబర్దస్త్ అవినాష్ కామెడీ టైటింగ్, అతని ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. జబర్దస్త్ అవినాష్ అనే పేరు కన్నా ముక్కు అవినాష్ అంటేనే బాగా అర్థం అవుతుంది.
టీవీ షోలతో పాపులర్ అయిన అతను.. సినిమాల్లో కూడా అడపాదడపా కనిపిస్తుంటారు. అనూజాను పెళ్లి చేసుకున్న ఆయన సరదాగా జీవితాన్ని గడుపుతున్నారు. ఆనందంగా సాగుతున్న అతని జీవితంలో ఊహించని ఇబ్బంది ఎదురైంది. అతని జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఎంతో కాలంగా అవినాష్-అనూజ జంట తల్లిదండ్రులు కావాలని కలలు కంటున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. ఈలోగా జీర్ణించుకోలేని విషాదం చోటు చేసుకుంది. ఈ జంట తమ బిడ్డను కోల్పోయారు. ఆ విషయాన్ని ఇనస్టాగ్రామ్ వేదికగా అవినాష్ వెల్లడించారు.
“నా లైఫ్‌లో సంతోషమైన, బాధ అయినా నా ఫ్యామిలీగా భావించే అభిమానులతోనే పంచుకుంటాను. ఇప్పటిదాకా నా జీవితంలో ప్రతి ఆనందాన్ని మీతో పంచుకున్నా. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూశాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది.
మీకు ఎప్పటికైనా చెప్పాలనే బాఽధ్యతతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నా. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ కృతజ్ఞతలు. ఎప్పటికీ ఈ ప్రేమ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధించవద్దు. అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్’’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అవినాష్‌ను ఓదార్చుతున్నారు.