హైపర్ ఆది ఒక బకెట్ అడ్డం పెట్టుకున్నా కూడా, సుమ ఉమ్మిన నీళ్లు హైపర్ ఆది ముఖం మీద, దుస్తుల మీద పడ్డాయి. సాధారణంగా ఇలాంటి కామెడీ జబర్దస్త్ లాంటి షోస్ లో చూస్తూనే ఉంటాం. కానీ ఒక స్టార్ యాంకర్ హోదాలో ఉన్న వ్యక్తిని ఇలాంటి ఒక కామెడీ సీన్ చేయించడం అనేది కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ షోలో అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత సుభాష్ జడ్జిగా వ్యవహరించింది.
కంటెస్టెంట్స్ చేసే పెర్ఫార్మన్స్ చూసి ప్రణీత షాక్ అయింది. రోషన్ కనకాల, మానస ఎంట్రీ ఇవ్వగానే హైపర్ ఆది కామెడీ పంచ్ లతో రెచ్చిపోయాడు. నువ్వు సుమగారి అబ్బాయివి అని తెలుసు. కానీ మనదగ్గర రికమండేషన్స్ కుదరవు అంటూ పంచ్ వేశారు. హీరోయిన్ దగ్గరకి వెళ్లి ఫ్రీగా ఉండరా నాతో అంటూ నవ్వులు పూయించారు. స్వేత అనే అమ్మాయి మ్యాడ్ చిత్రంలోని పడితే లైన్లో పడతది అనే సాంగ్ కి అదిరిపోయే విధంగా పెర్ఫామ్ చేసింది.
నోట్లో నీళ్లు పోసుకుని మళ్ళీ ఉమ్మేస్తూ చేసిన డ్యాన్స్ మూమెంట్ కొత్తగా అనిపించింది. ఆమె డ్యాన్స్ పై సుమ ఫన్నీగా స్పందించింది. స్వేత నేను చెప్పిన మూమెంట్ ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అని అడిగింది. మధ్యలో హైపర్ ఆది కలగజేసుకుని ఇంతగా చెబుతున్నారు కాబట్టి సుమగారే ఆ స్టెప్పు వేస్తారు అని అన్నాడు.