సామాన్యుడు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు. అతడిని చూసేందుకు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన ఫ్యాన్స్ నానా హంగామా సృష్టించిన సంగతి విదితమే. బస్సులను ధ్వంసం చేశారు. అయితే బస్సులు ద్వంసంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా మండిపడ్డారు. ఇక ప్రశాంత్ కూడా మునుపటి వినయం పక్కన పెట్టి.. కాస్త రూడ్ గా మాట్లాడటం మొదలు పెట్టాడు. మీడియాతో కూడా అతను అలానే బిహేవ్ చేశాడు. ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వను అంటూ అసభ్య పదజాలం కూడా వాడినట్టు మలువురు యూట్యూబ్ యాంకర్స్ తమ సోషల్ మీడియాలో వెల్లడించినట్టు తెలుస్తోంది.
దాంతో ప్రశాంత్ సాధించిన మంచి పేర కాస్త నెగెటీవ్ గా మారింది. ఈ విషయాలన్నీ వైరల్ అవ్వడంతో తాజాగా ప్రశాంత్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. పోలీస్ కేసు అవ్వడం.. ప్రశాంత్ కోసం తన ఊరుకు పోలీసులు వెల్లడంతో అతను పరారీలో ఉన్నట్టు తెలిసింది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టాడు ప్రశాంత్. అయితే బిగ్బాస్ నుంచి బయటకి వచ్చాక మొదటిసారి డైరెక్ట్ గా ప్రశాంత్ మాట్లాడుతూ ఓ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రశాంత్ ఎప్పటిలాగే తన పొలంలో కూర్చొని ఎమోషనల్ గా మాట్లాడాడు.
తనను బ్యాడ్ చేసే ప్రయత్నం జరగుతుందని. గెలిచిన ఆనందం కూడా లేకుండా చేస్తున్నారని. తన కోసం ఎంత మంది జనం వచ్చారో చూశారు కదా.. అభిమానంతో వారంతా వచ్చారు. ఒక రైతుబిడ్డ గెలిచాడని అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా ఊర్లో ఎంతో ఘన స్వాగతం పలికారు. నేను బిగ్బాస్ నుంచి బయటకి వచ్చాక నా కోసం ఇంతమంది వచ్చారా అని ఆనందపడ్డాను. కాని ఆ ఆనందం ఆవిరి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.