ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే అందరిని మాయ చేసేసారు వీరిద్దరూ. కాగా వీరిద్దరే పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ మనం ఒకటి కలిస్తే విధి మరొకటి తలచినట్టు.. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకులు తీసుకునేసాడు వీరిద్దరూ. అయితే సమంత చిత్రాలకు దూరంగా ఉన్నా.. ఫ్యాన్స్ కోసం మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉన్నారు. తాను చేసిన యాడ్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు కూడా పంచుకుంటున్నారు.
సమంత ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ వాడుతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తున్నారు. లైవ్‌లు నిర్వహిస్తున్నారు. తాజాగా కూడా ఆమె ఫ్యాన్స్‌తో లైవ్ నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ ఫ్యాన్ రెండో పెళ్లి గురించి ఆమెను ప్రశ్నించాడు. ‘‘ మళ్లీ పెళ్లి చేసుకునే విషయం గురించి మీరు ఆలోచించటం లేదా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు సమంత సమాధానం ఇస్తూ.. ‘‘ స్టాటిస్టిక్స్ ప్రకారం అదో చెడ్డ పెట్టుబడి’’ అని పేర్కొన్నారు. విడాకులకు సంబంధించిన కొన్ని లెక్కలను సైతం పోస్టు చేశారు.

ఆ పోస్టులో… ‘‘ మొదటి పెళ్లికి సంబంధించి విడాకుల రేటు దాదాపు 50 శాతంగా ఉంది. అదే విధంగా రెండో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 67 శాతంగా ఉంది. ఇక, మూడో పెళ్లికి సంబంధించి విడాకుల రేటు 73 శాతంగా ఉంది. అది కూడా స్త్రీలు, పురుషుల విషయంలో సమానంగా..’’ అని ఉంది. దీంతో సమంత రెండో పెళ్లి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని అర్థం అవుతోంది. పెళ్లి గురించి కంటే.. ఆరోగ్యం గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు తేటతెల్లం అవుతోంది. ఓ ఫ్యాన్ ‘మీ రాబోయే సంవత్సరం ప్లాన్ ఏంటి?’’ అని అడగ్గా.. ‘‘ మంచి ఆరోగ్యం’’ అని సమంత సమాధానం ఇచ్చింది.