ఎంతో మంది సెలబ్రిటీలను వెనక్కినెట్టి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా అవతరించాడు ఈ రైతుబిడ్డ. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. ఎవ్వరూ ఊహించని విధంగా టైటిల్ ను ఎగరేసుకుపోయాడు. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి. ఆడియన్స్ లో కూర్చున్న స్థానం నుంచి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న ప్రశాంత్ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలు ఎదుర్కొన్నాడు.
అతడు ఈ రియాలిటీ షోలో పాల్గొనే నాటికి.. అతడెవరో కూడా చాలా మందికి తెలీదు. అలాంటి ఓ కామన్ మ్యాన్ ఇలాంటి బిగ్ రియాలిటీ షో టైటిల్ గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇదంతా కాసేపు పక్కనపెడితే..ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్-7 ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపలకు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానులు భారీగా తరలివచ్చారు.
అయితే సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ పేరు ప్రకటించగానే అతడి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఇరువురి అభిమానుల మధ్య గొడవ మొదలైంది. అది దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ గట్టిగా కొట్టుకున్నారు.