తెలుగు బుల్లితలపై యాంకర్ శ్యామల తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకుంది. వెండితెరపై కూడా పలు సినిమాలలో అక్క, వదిన పాత్రలలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డి ని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎయిర్ పోర్టులో విమానయాన సంస్థల నుంచి సెలెబ్రిటీలకు అప్పుడప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.
ఇది వరకు ఎంతో మంది సెలెబ్రిటీలు పలు ప్రైవేట్ విమానయాన సంస్థలు అందిస్తున్న సేవల పట్ల పెదవి విరిచారు. తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా యాంకర్ శ్యామల సైతం ఇండిగో సేవల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. డొమెస్టిక్ ఫ్లైట్ దిగిన తరువాత లగేజ్ విషయంలో ఇండిగో సంస్థ సరిగ్గా పని చేయడం లేదని, దాదాపు 40 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ప్రతీ సారి లగేజ్ విషయంలో ఇలాంటి ఇబ్బందులే వస్తున్నాయని పేర్కొంది. చివరకు శ్యామల దెబ్బకు ఇండిగో దిగి వచ్చి క్షణాల్లో సమస్యను పరిష్కరించినట్టుగా కనిపిస్తోంది.