అమర్ దీప్ చెంప పగలగొట్టిన శివాజీ.. వెనకేసుకొచ్చిన అమర్ భార్య.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్ మాత్రం సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. ఇప్పటికే అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఆరుగురు ఫైనలిస్టులు ఉండగా.. ఆరో స్థానంలో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత ఐదో స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. అయితే ఇక ఈ టాస్కుల మధ్య శివాజీ వైఖరీ ఏ మాత్రం మారడం లేదు. తనకు క్లోజ్ అయిన యావర్ గురించి కూడా వెనక మాట్లాడడం మొదలుపెట్టాడు.

అమర్ పై నాన్ స్టాప్ కౌంటర్లు.. ముందుగా బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ కు ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ముందుగా అమర్ దీప్ ను జ్యోతిష్యుడిగా వ్యవహరించమన్నాడు. హౌజ్ మేట్స్ అంతా ఒకరు తర్వాత ఒకరు వచ్చి జాతకం చెప్పించుకోవాలని అన్నాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా అమర్ దీప్ ను ఒక ఆట ఆడేసుకున్నారు. తను ఏం చెప్పినా రివర్స్ కౌంటర్లు వేస్తూ.. జోకులు వేస్తూ.. అమర్ ను టార్గెట్ చేశారు.

ముఖ్యంగా శివాజీ, అర్జున్ అయితే అమర్ పై ఉన్న చనువుతో కాస్త ఎక్కువగానే మాట్లాడారు. అమర్ జాతకమంతా తనకు తెలుసని అర్జున్ అన్నాడు. తొందరలో ఏది రివీల్ చేస్తాడో అని అమర్.. తనను ఆపుతూ ఉన్నాడు. ఇక అమర్ తో ఫన్ పూర్తయ్యిందని.. శివాజీని జ్యోతిష్యుడిగా వ్యవహరించమన్నారు బిగ్ బాస్. అందరినీ వదిలేసి ముందుగా అమర్ జాతకమే చెప్పాలని నిర్ణయించుకున్నాడు శివాజీ. దానికి అమర్ సహకరించకపోవడంతో చెంప పగలగొట్టి మరీ తనను కుదురుగా కూర్చోబెట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *