కేసీఆర్‌కి ఇప్పుడు ఆరోగ్యం మరింత మెరుగవ్వడంతో, ఇక ఆయన ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదని డాక్టర్లు తేల్చారు. దాంతో ఆయన్ని.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కి కాకుండా.. దగ్గర్లోనే. నందినగర్‌లోని పాత ఇంటికి తరలించాలని నిర్ణయించారు. అందువల్ల ఆ ఇంటి దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడగా.. ఆయన తుంటి ఎముకకు గాయం అయ్యింది.
దాంతో వైద్యులు ఆయనకు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. అయితే.. కేసీఆర్ పూర్తిగా కోలుకోవటానికి సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. కాగా.. ఆస్పత్రిలో ఉన్న ఈ ఎనిమిది రోజులు నిష్ణాతులైన వైద్యులు.. కేసీఆర్‌ను 24 గంటల పాటు జాగ్రత్తగా పర్యవేక్షించారు. కేసీఆర్ చాలా తొందరగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుండటంతో.. ఈరోజు కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కేసీఆర్ నందినగర్‌లో ఉన్నవవపాత ఇంటికి వెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే.. వైద్యారోగ్యశాఖలోని లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లను మార్చుతామని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. వైద్యారోగ్యశాఖ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వైద్యారోగ్యశాఖ ఉద్యోగులకు మేలు చేస్తూనే.. ప్రజలకు రక్షణగా నిలుస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు రాజనర్సింహా.