రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో వైరల్, ఈసారి మరింత హాట్ గా వీడియో.

మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియో వివాదం నుంచి బయటపడింది.. అది తాను కాదు అని తేలింది. ఇప్పుడు మరోసారి మరో వీడియోను సోషల్ మీడియాలో వదిలారు.. ఇప్పుడు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.. ఇందులోనూ సేమ్‌ అదే మాదిరిగా ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్సీ) ద్వారా ఆమె ఫేస్‌ని మార్ఫింగ్‌ చేయడం గమనార్హం. ఈ వీడియో ఇంటర్నెట్‌ రచ్చ చేస్తుంది. అయితే ఆ వీడియో బ్రిటన్ కి చెందిన భారతీయ మూలాలున్న యువతిది. ఆమె పేరు జరా పటేల్. ఆమె తరచుగా హాట్ వీడియోలు, ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

జరా పటేల్ వీడియోను ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ తో రష్మిక మందానదిగా మార్చారు. జరా పటేల్ సైతం ఈ వీడియోపై స్పందించడం విశేషం. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అయినా ఇలా జరిగినందుకు చింతిస్తున్నాను, అని చెప్పుకొచ్చింది. ఒక నటిగా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నేను ఎదుర్కొన్నాను. ఒకవేళ నేను స్కూల్, కాలేజ్ లో ఉన్నప్పుడు ఇలా జరిగితే నా పరిస్థితి ఏంటని రష్మిక మందాన అభిప్రాయపడింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఫలితం శూన్యం. నిందితులను పట్టుకోలేదు.

దీంతో ఆకతాయిలు మరోసారి రెచ్చిపోయారు. రష్మిక పై మరో డీప్ ఫేక్ వీడియో చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో కూడా వల్గర్ గా ఉంది. అలియా భట్, కాజోల్, ప్రియాంక చోప్రాతో పాటు పలువురి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీన్ని నియంత్రించడం ప్రభుత్వాల వల్ల అయ్యేలా లేదు. రానున్న కాలంలో ఎందరు బలి కానున్నారో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *