అమృత అరోరా భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్, టీవీ ప్రజెంటర్, విజే. ఆమె హిందీ సినీ నటి మలైకా అరోరా చెలెళ్లు. అయితే సినిమాల్లోకి వచ్చి ఒక వెలుగు వెలగాలని ఎంతో మంది కలలు కంటుంటారు. అందుకే చిన్నచిన్న గ్రామాలు పట్టణాల నుంచి నిత్యం ఎంతో మంది ముంబైకి వెళ్తుంటారు. అందులో కొందరి కలలు నెరవేరితే.. మరికొందరు మాత్రం చీకట్లో మగ్గుతున్నారు. అందులో అమృత అరోరా ఒకరు. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా సోదరే.. ఈ అమృత అరోరా.
ఈమె పాకిస్థానీ సంతతి క్రికెటర్‌తో ఎఫైర్ నడిపి.. ఆ తర్వాత తన స్నేహితురాలి భర్తకు దగ్గరై.. గర్భం దాల్చింది. మొత్తం ఏడు సార్లు అబార్షన్ చేసుకున్న ఈ నటి.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. 1981లో జన్మించిన అమృతా అరోరా.. తన సోదరి మలైకా తరహాలో వీడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించింది. 2002 సంవత్సరంలో విడుదలైన చిత్రం ‘కిత్నే డోర్ కిత్నే పాస్’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగపెట్టింది. ఐతే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితం ద్వారా తరచూ వార్తల్లో ఉండేది అమృతా అరోరా.

2004లో పాకిస్థానీ సంతతి ఇంగ్లండ్ క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్‌తో అమృతకు ఎఫైర్ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. ఉస్మాన్ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఇండియా వచ్చారని, ఇక్కడే అమృతను కలిశాడు. తాను ఉస్మాన్‌ను ప్రేమిస్తున్నట్లు పలు ఇంటర్వ్యూల్లోనూ ఆమె చెప్పిందట. ఉస్మాన్ ఇండియాలో చాలా హై ప్రొఫైల్ పార్టీలకు హాజరయ్యేవాడు. అమృత కూడా అక్కడికి వెళ్లేది.అంతేకాదు ఉస్మాన్ సోదరుడు బాలీవుడ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. అతడికి అమృత కూడా సాయం చేసేది. ఒకవైపు ఉస్మాన్‌తో ప్రేమాయణం సాగిస్తూనే.. తన స్నేహితురాలు నిషా భర్త షకీల్ లడక్‌తో ఎఫైర్ పెట్టుకుంది అమృత.
షకీల్ లడక్ వ్యాపారవేత్త. 2005లో అతడికి చాలా దగ్గరైంది అమృత. ఈమె ఎంట్రీతో నిషా, షకీల్ లడక్ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఎన్ని విమర్శలు వచ్చినా.. షకీల్, అమృత వివాహం చాలా వైభవంగా జరిగింది. మూడు మతాల ప్రకారం వివాహం చేసుకున్నారు.మొదట క్రైస్తవ మతం ప్రకారం ఒక చర్చిలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ముస్లిం సంప్రదాయం ప్రకారం .. అనంతరం పంజాబీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.