మా తెలుగు ఇండస్ట్రీ రిక్వెస్ట్ లను పరిశీలించినందుకు , తెలుగు సినిమా అభివృద్ధి సహకరిస్తాను అన్నందుకు సీఎం జగన్ గారికి థ్యాంక్స్ అనీ , మిమ్మల్ని కలసినందుకు సంతోషంగా ఉందనీ , చిత్ర పరిశ్రమ సమస్యలకు ఒక పరిష్కారం చూపిస్తారనే హోప్ తో ఉన్నామనీ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా వరకు రాజకీయాలకు దూరంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. కానీ కృష్ణ గారి కుటుంబం వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా సమయాలలో ఎన్నికల టైంలో కూడా కృష్ణ కుటుంబ సభ్యులు అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది.
సూపర్ స్టార్ కృష్ణ కూడా ఏలూరు ఎంపీగా .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ మహేష్ వంతు వచ్చేసరికి.. తిరుగులేని క్రేజ్ ఉన్నా గానీ ఎక్కడా కూడా రాజకీయ మారక తనకు అంటకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.