కొన్నేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించడంతో మరో వివాహం చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో తన దూరపు బంధువు అయిన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. గత సంవత్సరం తేజస్విని ఓ బాబుకి జన్మనిచ్చింది. దీంతో 50 ఏళ్ళ వయసులో దిల్ రాజు మరోసారి తండ్రి అయ్యాడు. అయితే దిల్ రాజు తన రెండో భార్య తేజస్విని కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాడట. ఆమెకు చాలా కాలంగా ఉన్న కోరిక తీర్చడానికి ఆయన ట్రై చేస్తున్నాడట. దీనికి సంబంధించి క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
దిల్ రాజు కంటే తేజస్విని వయసులో చాలా చిన్నది. ఆమెకు మోడలింగ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందట. యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టమట. మోడలింగ్ చేయాలని చాలా ట్రై చేసిందట కూడా తేజస్విని. కానీ ఆమె కుటుంబం దానికి అంగీకరించలేదట. ఇక వాళ్లని ఒప్పించే ఓపిక లేక.. ఎదిరించలేక తన కలను చంపేసుకుందట. ఈ విషయం దిల్‌రాజును పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి చెప్పిందట. ఇక మన రాజు ఓకే చెప్పడంతో ఇప్పుడు ప్లానింగ్ స్టార్ట్ చేశారట. తేజస్వినిని మోడలింగ్ రంగంలో దించడానికి అన్ని ప్లాన్స్ రెడీ చేశారని టాక్.
దీని కోసం ఆయన ఏకంగా కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే దిల్ రాజు తన భార్యను హీరోయిన్‌గా కానీ.. ఏదైనా సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర చేయడానికి కానీ రెఫర్ చేస్తారట. ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దిల్‌రాజు నువ్వు నిజంగా దిల్ ఉన్న మొగుడివ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భర్తంటే ఇలా ఉండాలని అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరి కొందరేమో చేతిలో పైసా ఉంటే చందమామను కూడా జేబులో దాచుకోవచ్చంటూ ట్రోల్ చేస్తున్నారు.