నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ లారెన్స్ పై కూడా కామెంట్స్ చేసింది. అతడు తన ప్రైవేట్ భాగాలను తాకాడని శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ లో వివాదాస్పదంగా మారాయి. ఆ సమయంలో లారెన్స్ స్పందించి తనకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చినా.. శ్రీరెడ్డి మాత్రం లారెన్స్ ని బూతులు తిట్టడం మానలేదు. అయితే ఈరోజు ఆమె పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తను బూతులు తిట్టిన లారెన్స్ సినిమాలోనే శ్రీరెడ్డి నటించబోతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేఖంగా శ్రీరెడ్డి చేసిన పోరాటానికి సర్వత్రా సపోర్ట్ లభించినప్పటికి పవర్ స్టార్ పవన్ ని అసభ్య పదజాలంతో ధూషించడంతో ఆ పోరాటం కాస్తా పక్కదోవ పట్టింది.దాంతో శ్రీరెడ్డిని మీడియా పట్టించుకోవడం మానేసింది. సోషల్ మీడియా వేధికగా కొందరి పేర్లను బయట పెట్టిన శ్రీరెడ్డి,ఇప్పుడు చెన్నై వెళ్లి అక్కడ మీడియా ఎదుట తమిళ పరిశ్రమలోని కొందరి పేర్లను బయటపెట్టింది.
వారిలో ఒక పేరు నటుడు,దర్శకుడు రాఘవ లారెన్స్. తనను హోటల్ రూం కి పిలిచి అసభ్యంగా ప్రవర్తించి తర్వాత అవకాశం ఇవ్వలేదంటూ శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.అదే అంశంపై లారెన్స్ ఏమన్నారో ఆయన మాటల్లోనే… సుమారు ఏడు సంవత్సరాల క్రితం శ్రీరెడ్డి.