అతిగా నీళ్లు తాగడం కూడా ఆరోగ్యానికి అంతగా మంచిది కాదట. పైగా ప్రమాదకరం కూడానట. అతిగా నీళ్లు తాగడం వల్ల ఓ సూపర్ హీరో చనిపోయాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా దాదాపు 40 ఏళ్ల క్రితం చాలా చిన్న వయసులో మరణించిన లెజెండరీ నటుడు Bruce Lee మరణంపై స్పెయిన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే శవ పరీక్ష సమయంలో బ్రూస్ లీ మెదడు 1,575 గ్రాముల వరకు ఉబ్బినట్లు వెల్లడైంది. ఇది సగటు 1,400 గ్రాముల కంటే ఎక్కువగా ఉంది. ఈ వాపు కారణంగానే బ్రూస్ లీ చనిపోయాడని పరిశోధకులు నిర్ధారించారు.
Independent.co.uk నివేదించిన ప్రకారం.. హైపోనాట్రేమియా వల్ల ఎడెమా ఏర్పడిందని పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాదు.. కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా బ్రూస్ లీ ని వేధించాయని, అది కూడా అతను చనిపోవడానికి కారణమైందని శాస్త్రవేత్తలు క్లినికల్ కిడ్నీ జర్నల్‌లో ప్రచురించారు. ‘లీ.. అధికంగా నీటిని తీసుకోవడం, అంతే స్థాయిలో మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల హైపోనాట్రేమియాకు దారి తీసింది. బ్రూస్ లీ మూత్రపిండాలు సరిగా పని చేయకపోవడం వల్లే ఇది జరిగింది.
ఇది కూడా అతని మరణానికి కారణమైంది.’ అని పరిశోధకులు పేర్కొన్నారు. ‘బి వాటర్ మై ఫ్రెండ్’ అనే కోట్ లీ పేరిట ప్రసిద్ధి చెందింది. ఆ వాటరే అతని ప్రాణం తీసిందంటున్నారు నిపుణులు. మార్షల్ ఆర్ట్స్ చేసే సమయంలో లీ డైట్‌లో దాహాన్ని పెంచే జ్యూస్‌లు, ప్రోటీన్ డ్రింక్స్ బాగా తీసుకునేవారని నివేదిక పేర్కొన్నారు. అంతేకాదు.. లీ తన శరీరంలోని సోడియంను తొలగించడానికి, కండరాలు మరింత పెరగడానికి ప్రయోగాలు చేసినట్లు తెలిపారు.
అంతేకాదు.. లీ చనిపోవడానికి ముందు.. నెలల్లో 10 నుంచి 20 సిరామిక్ బాటిల్ షేక్స్ తాగేవారని అతని సన్నిహితులు చెబుతున్నారు. నివేదిక ప్రకారం.. లీ చనిపోయిన రోజు రాత్రి గంజాయి తాగి, అనంతరం నీరు తాగాడు. ఆ కొద్దిసేపటికే అంటే రాత్రి 7.30 గంటల సమయంలో తలనొప్పి, తల తిరగడం పరిస్థితి ఎదుర్కొన్నాడు. దాంతో అతను ఈక్వేజిక్ అనే పెయిన్ కిల్లర్ తీసుకుని పడుకున్నాడు. ఆ తరువాత 2 గంటల తరువాత అతనిలో ఎలాంటి చనలం, స్పందన కనిపించలేదు.