మనోజ్ గా అందరికీ సుపరిచితుడైన మంచు మనోజ్ కుమార్ తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్ గా పేరొందిన నటుడు మోహన్ బాబు రెండవ కొడుకు. మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు.బిందాస్ సినిమాకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.
అయితే మోహన్ బాబుకు మంచు విష్ణు, మనోజ్ తో పాటు లక్ష్మీ అనే కూతురు కూడా ఉంది. ఇటీవలికాలంలో మనోజ్ కు, విష్ణుకు మధ్య విభేదాలున్నాయని, సందర్భాన్ని బట్టి అవి బటయపడుతున్నాయంటున్నారు. రెండురోజుల క్రితమే మనోజ్ సోదరుల మధ్య వివాదానికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. అవి అతని సోదరుడు విష్ణు గురించే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మంచు లక్ష్మి, మనోజ్ ఒక వైపు ఉంటారని, విష్ణు మాత్రం వేరే పార్టీ కాబట్టి వారి మధ్య విభేదాలు వచ్చినా అవి బయటకు కనిపించడంలేదంటున్నారు.
అయితే ఇదంతా మోహన్ బాబు ఆధ్వర్యంలోనే జరుగుతోందని కొందరంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా మనోజ్ తన అన్నయ్య విష్ణుతో గొడవలు పడుతున్నాడని, ఇటీవల సంపూర్ణేష్ బాబు సోదరా చిత్రానికి సంబంధించిన పాటను విడుదల చేయగా, ఈ ఈవెంట్‌లో మనోజ్ తమ సోదరుల మధ్య గొడవల గురించి మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు.