నీ వల్లే రాజకీయాల్లోకి వచ్చా..! మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు పగలబడి నవ్విన మహేష్ బాబు.

గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో బిజీ బిజీగా ఉన్న మంత్రి.. సోమవారం రాత్రి మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన ‘యానిమల్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన స్పీచ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ..“ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్ చిత్రబృందం వచ్చింది. మహేష్ బాబు గారు.. నేను మీ సినిమా బిజినెస్ మేన్ చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను.

ఆ సినిమా పదిసార్లు చూసి ఎంపీ అయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్. రణబీర్ నీకు నేనొక విషయం చెప్తాను. అప్పట్లోనే నేను చెప్పాను.. బాలీవుడ్, హాలీవుడ్ ను.. తెలుగు హీరోలు రూల్ చేస్తారు అని.. మా తెలుగువాళ్లు చాలా స్మార్ట్. రాజమౌళి, దిల్ రాజు ఇప్పుడు సందీప్ వచ్చాడు. హాలీవుడ్, బాలీవుడ్ ను హిందుస్థానీ రూల్ చేస్తోంది. హైదరాబాద్ అందులో టాప్ మోస్ట్.. మా తెలుగు ప్రజలు చాలా స్మార్ట్.

పుష్పతో అల్లు అర్జున్.. దుమ్మురేపాడు.. ఇప్పుడు సందీప్ మరోసారి బాలీవుడ్ లో దుమ్మురేపుతాడు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నాలుగుసార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్నారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా 500 కోట్లు కలక్షన్స్ వస్తాయి .. పక్కా.. ఈ సినిమా సూపర్ హిట్”అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *