అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో ఆముదం ఒకటి. ఇది మనందరికీ తెలిసిందే. ఆముదం చెట్టు ఆకులు, కాయలు, గింజలు, ఆముదం నూనె మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పూర్వ కాలంలో ఆముదం నూనెను ఎక్కువగా ఉపయోగించే వారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి చెట్టుని దీని సంస్కృతంలో పంచాంగముల వర్ధమానాన్ని పిలుస్తూ ఉంటారు. మూడు రకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎర్రముదాల చెట్టు, తెల్లాముదాల చెట్టు, పెద్ద ఆముదాల చెట్టు అనేటువంటి మూడు రకాలు ఉంటాయి.
తెల్లాముదం చెట్లలో పెద్ద గింజలు కాచేదొకటి.. చిన్న గింజలు కాచేది అంటే చిట్టాము రకం ఒకటి ఉంటాయి. తెళ్లా ఆముదం చెట్టు కన్నా ఎర్రముదం తో అధిక గుణగణాలు ఉంటాయి. ఇది పక్షవాతంలాంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది. సమస్త వాతలకి అజీర్ణ రోగాలకి శరీరంలో ఉన్నటువంటి సమస్త అవయవాలు వచ్చేటువంటి వ్యాధులను పోగొట్టేటువంటి శక్తి ఈ ఆముదం లో ఉంటుంది. పక్షవాతానికి మలబద్దానికి ఈ ఆముదం చెట్టు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని ఆకులు ముక్కలుగా చేసి బిడ్డల కడుపు స్థానం మీద రెండు మూడు సార్లు కనుక ఆకులతో రుద్దితే కడుపులో పురుగులన్నీ మలద్వారం గుండా బయటకు వచ్చేస్తాయి.
అలాగే మూలవ్యాధిని నిర్మూలించడానికి లేత ఆముదపాకుని ఉపయోగిస్తారు. లేదా ఆముదపాకులు ఒక ముద్ద కర్పూరం బిళ్ళని కలిపి మెత్తగా నూరి కట్టు కడితే మూల వ్యాధి తొలగిపోతుంది. అలాగే రుతు చక్రవాగిపోయినటువంటి స్త్రీలకి ఆముదపాకుని కొంచెం నలగ కొట్టి వేడిచేసి గోరువెచ్చగా పొత్తికడుపు పైన పెడితే హరించుకుపోయి బహిష్టు వస్తుంది. అంతేకాదు నూనె ఆముదంతో తయారు చేసినటువంటి ఔషధాలు విరివిగా లభ్యమవుతున్నాయి.
ఆయుర్వేదంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ ఆముదపు చెట్టు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం మనకు వచ్చేటువంటి అనేక రకాల సమస్యలకి ఇది ఒక గొప్ప పరిష్కారం మార్గం అవుతుంది. అని తెలుసుకోవడం ఎంతో అవసరమైనటువంటి విషయం అనేక రోగాలని అనేక వ్యాధులను నయం చేసేటువంటి ఆముదపు చెట్టు కేవలం ఒక పిచ్చి మొక్కగా ఒక మూలన పడి ఉండటం అనేది చాలా ప్రమాదం. ప్రతి ఒక్కరి పెరట్లో కచ్చితంగా పెంచుకోదగ్గ చెట్టు. దీని యొక్క ప్రతి ఒక్క ఉపయోగాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.