డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి మీకు తెలుసా..? ప్రయోజనాలు ఏంటో తెలిస్తే వదిలిపెట్టరు.

డ్రాగన్ ఫ్రూట్​ విటమిన్ సి, అవసరమైన కెరోటినాయిడ్స్‌తో ఫుల్​గా నిండి ఉంటుంది. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కచ్చితంగా సహాయపడుతుంది. మీ తెల్ల రక్త కణాలను రక్షించడం ద్వారా ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. అయితే ఈ డ్రాగన్ ఫలంలో కేలరీలు తక్కువగా, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి.

అందుకే ఈ పండు తినడం ఎంతో మేలు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న కాలంలో మనిషి రోగనిరోధక శక్తి కోల్పోతున్నాడు. ముందే కరోనా కాలం.. అందుకే వర్షాకాలం కారణంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంది. దీంతో అనారోగ్యం బారినపడతాం. ఈ ఫ్రూట్‌ తింటే నిగనిరోధక శక్తి పెంచడమే కాకుండా వివిధ రకాల వ్యాధులు దరి చేరనివ్వకుండా నుంచి కాపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో నేచురల్ గా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను, క్యాన్సర్ ను, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తాయి.

డ్రాగన్ లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరం చేస్తాయని చెబుతుంటారు. అలాగే షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్‌ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. ఈ డ్రాగన్‌ పండులో విటమిన్ సి, కెరోటినాయిడ్లు ఇమ్యునిటీని పెంచుతాయి. వైట్ బ్లడ్ సెల్స్ ను కాపాడటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెరిగేలా చేస్తాయి. దీంతో అంటువ్యాధులు గానీ ఇతర ఏ జబ్బులు గానీ మన దరి చేరకుండా చూస్తాయి. తిన్న ఆహారం జీర్ణం కావటానికి ఆక్సీజన్ అవసరం. ఒంటి నిండా ప్రాణ వాయువు సరఫరా కావాలంటే ఐరన్ పుష్కలంగా ఉండాలి.

డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇనుము లోపాన్ని అధిగమించవచ్చు. మిగతా అన్ని పండ్లతో పోల్చితే మెగ్నీషియం ఎక్కువగా ఉండేది డ్రాగన్ ఫలంలోనే. బరువు తగ్గాలనుకునేవారికి డ్రాగన్ ఫ్రూట్స్ బెస్ట్ పండ్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. ఇందులోని గుజ్జు తెలుపు రంగులో ఉంటుంది. మధ్యలో గింజలుంటాయి. గింజలతో సహా తింటారు. కరకరలాడే ఆ గింజలు అందరికీ నచ్చుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *